NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో ఘనంగా లూయీ బ్రెయిలీ 217వ జన్మదిన వేడుకలు

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దృష్టి లోపం గల వారికి ప్రత్యేక “బ్రెయిలీ” లిపి ప్రధాత సర్ లూయీ బ్రెయిలీ  217వ  జన్మదిన వేడుకలు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమమునకు   సంయుక్త కలక్టర్ డా:ఎం. జె.అభిషేక్ గౌడ  ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  కార్యక్రమమునకు ఏలూరు జిల్లా లోని దృష్టి లోపం కలిగిన దివ్యాంగులు దాదాపు 300 మంది ఈ వేడుకలకు హాజరు అగుట జరిగినది.  సదరు కార్యక్రమము నందు దృష్టి లోపం కలిగిన దివ్యాంగులచే కేక్ కట్ చేయించారు.  ఈ కార్యక్రమము నందు 20 మంది దృష్టి లోపం కలిగిన దివ్యాంగులకు వారి సేవలకు గుర్తింపుగా సన్మానము చేసి ప్రశంసాపత్రాలు అందజేశారు. సదరు కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయో వృద్దుల  సంక్షేమ శాఖ ఏడి రం కుమార్,వి సి ఈ ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు,జి.డి.వి.ఎస్. వీర భద్ర రావు, గిడియన్, కుందేటి జయరాజ్  వివిధ సంఘాల వారు మరియు స్వచ్చంద సేవా సంస్థల తరపున పరివర్తన్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెయిలీ క్యాలెండర్ ని జేసి ఆవిష్కరించారు.

About Author