కూటమి ప్రభుత్వానికి మరో 20 ఏళ్లు ఎదురు లేదు,తిరుగులేదు
1 min read
సంక్రాంతి అంటే కొందరు కోడి పందేలు, జూద పండగలా వక్రీకరిస్తున్నారు
సంక్రాంతి అంటే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఎంతగానో నెలవైన పెద్ద పండగ
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిది,న్యూస్ నేడు: పెదవేగి మండలం దుగ్గిరాల లోని సంక్రాంతి వేడుకల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేస్తూ సేవలందిస్తున్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని 4మండలాల్లో పలు శాఖలకు చెందిన దాదాపు 2000 మంది ప్రభుత్వ సిబ్బందికి సంక్రాంతి కానుకలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు – ఏలూరు రూరల్ మండలంలోని మండల పరిషత్ మరియు సచివాలయాల సిబ్బందికి స్వయంగా సంక్రాంతి కానుకలు అందజేసి పండగ శుభాకాంక్షలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వంలోనే రైతన్నలకు అసలు సిసలైన సంక్రాంతి అని, గంటల వ్యవధిలో ధాన్యం సొమ్ములు చెల్లింపు, అన్నదాత సుఖీభవ, రాజముద్ర తో కలిగిన పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా రైతుల ఆత్మ అభిమానాన్ని మరింత పెంచడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ఎంతో అండగా నిలుస్తుందనీ అన్నారు.. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వచ్చిన ప్రజలకు సొంత ఊరికి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు.. సంక్రాంతి పండుగను చాలామంది కోడిపందాలు మరియు జూదంగా మాత్రమే చూసేలా భావిస్తున్నారని , కానీ తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు నెలవైన పెద్ద పండుగగా సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని తెలిపారు… రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవడంతో పాటు మహిళా సాధికారత కూడా ఎంతగానో కృషి చేస్తూ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుందని, అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఆ తల్లుల ఎకౌంట్లో నేరుగా డబ్బు జమ చేయడం జరిగిందని, గత వైసిపి ప్రభుత్వం లో జరిగిన తప్పిదాల వల్ల మ్యాపింగ్ లో పొరపాట్ల వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడి ఇంకా పథకం అందుకొని తల్లుల లిస్టు కూడా సిద్ధం చేసి వారికి కూడా త్వరలోనే పథకం డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, సీనియర్ నాయకులు పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, జనసేన నాయకులు జాలిపూడి సొసైటీ చైర్మన్ మోటేపల్లి పవన్ , ఏలూరు రూరల్ మండల తాసిల్దార్ విజయ్ కుమార్, సహా పలువురు ఎండిఓ లు వివిధ శాఖల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.

