NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ శబరి

1 min read

-తలముడిపి,వీపనగండ్ల’లో  పూజల్లో పాల్గొన్న ఎంపీ..

మిడుతూరు(నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లామిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో గురువారం ఉదయం గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి ఐదు లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన త్రాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల ఎంపీ మరియు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరిరిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ముందుగా గ్రామంలో ఎంపీకి నాయకులు డీజే డ్రమ్స్ నడుమ ఘనంగా స్వాగతం పలికారు.తర్వాతగ్రామంలో జరిగిన శ్రీ ఉమా సహిత జటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అశేష భక్తుల నడుమఘనంగా జరిగింది.ముందుగా ఎంపీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.దేవాలయంలో హోమం,అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.తర్వాత వీపనగండ్లలో జరిగిన శ్రీ నాభిశిలా ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దాసి సుధాకర్ రెడ్డి,సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు,డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,గ్రామ నాయకులు సీతారామి రెడ్డి, కాతా అంకిరెడ్డి,జింక చంద్రశేఖర్,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఎస్ఐలు ఓబులేష్,మణికంఠ, మల్లికార్జున,మాజీ సర్పంచ్ రామచంద్రుడు,నాగేశ్వరరావు,సత్యం రెడ్డి,నవాజ్అలీ తదితరులు పాల్గొన్నారు.

About Author