దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి – ఏఐటియుసి
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి తాలూకా కార్యదర్శి ఎం రంగన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక పత్తికొండ గ్రామపంచాయతీ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మె నోటీసు పంచాయతీ కార్యదర్శి ఈఒ నరసింహులుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు చెత్త చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా ప్రభుత్వం పనులు చేయించుకుంటుందని అన్నారు .గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల నెల జీతం చెల్లించుటకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26 వేల చట్టాన్ని అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని పదవి విరమణ బెనిఫిట్ కింద5 లక్షలు ఇవ్వాలని అదేవిధంగా కార్మికులు పదవి విరమణ పొందిన, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులు తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు రోజు 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్న చట్టాలను యధావిధిగా ఉంచాలని గత సంవత్సరం నవంబర్ 21 అమలు లోకి కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు.

