ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయండి..
1 min read

జడ్పిటీసీ యుగంధర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి..,
మిడుతూరు, న్యూస్ నేడు: ఈనెల 28న నందికొట్కూరు పట్టణంలో జరిగే ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని మిడుతూరు మండల జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి మరియు వైయస్సార్సీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డిఅన్నారు.శనివారం లోకేశ్వర్ రెడ్డి స్వగృహంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ర్యాలీ పోస్టర్లను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద,మధ్య తరగతి విద్యార్థులు డబ్బులు కట్టలేక తీవ్రంగా నష్టపోతారని పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మెడికల్ కాలేజీ లను ప్రభుత్వమే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.ఈనెల 28న జరిగే ర్యాలీని జయప్రదం చేసేందుకు నాయకులు కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా శివ రామకృష్ణారెడ్డి,సహకార సొసైటీ మాజీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,చింతలపల్లి మల్లేశ్వర రెడ్డి,చెరుకుచెర్ల మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

