NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రేట్ ఫుల్ గిఫ్ట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం

1 min read

సెంట్ విన్సెంట్ పాల్ “చారిటీ ఆఫ్ సిస్టర్స్”లో మానసిక వికలాంగులకు అల్పాహారం అందజేత

మానవతా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు పలువురికి అందించాలి

పొలిమేర హరికృష్ణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రేట్ ఫుల్ గిఫ్ట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా స్థానిక తంగేళ్ల మూడి సెయింట్ విన్సెంట్ పాల్ చారిటీ ఆఫ్ సిస్టర్స్ (మానసిక వికలాంగుల ఆశ్రమం)లో శుక్రవారం సుమారు 75 మందికి సొసైటీ నిర్వాహకులు  అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొలిమేర హరికృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో  గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ అధ్యక్ష , కార్యదర్శులు,సొంగ  మధుసూదనరావు, యర్రా జయదాస్ మరియు సంఘ సభ్యులు వేయప్రాసలకోర్చి ఎన్నో ఒడిదుడుకులతో కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని, అలాగే నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి అవసరమయ్యే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సొసైటీ అభివృద్ధి పథంలో మరింతగా రాణించి ఉన్నత స్థితికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జరగబోయే కార్యక్రమాలలో కూడా ఏ ఆటంకులు,అడ్డంకులు లేకుండా దైవాశీస్సులతో  కొనసాగాలని అన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఫిర్యాల. పావని జ్యోతి మణి,చారిటీ సిస్టర్స్  తదితరులు పాల్గొన్నారు.

About Author