NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్  పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం

1 min read

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో పలువురు కానిస్టేబుల్ లకు ప్రత్మనియ ఎర్పట్లు

పర్యవేక్షించిన అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్యచంద్రరావు

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు గా ఎంపికైన వారితో ఈ రోజు అనగా మంగళవారం ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నేడు ఏ.పీ.ఎస్పీ 6వ  బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు యువ గళం కార్యక్రమము లో నియామక పత్రాలను అందించే కార్యక్రమములో  నేపథ్యంలోఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లాలో ఎంపిక కాబడిన సివిల్, ఏ.పీ.ఎస్పీ కానిస్టేబుళ్లు పురుష  మహిళా అభ్యర్థులు 30 మంది ఎస్.సి.టి.పి .సి సివిల్  116 మంది ఏ.పి.ఎస్. పి ఎస్.సి.టి.పి .సి మొత్తం 146  మంది వారి యొక్క తల్లి దండ్రులు లతో సహా వీరందరికీ ఏలూరు జిల్లా పెదవేగి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజీ నుండి 10 ఆర్.టి.సి బస్సులలో అభ్యర్థు లతో పాటుగా వారి యొక్క యొక్క తల్లి దండ్రులు లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది తో రవాణా సదుపాయం కల్పించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్య చంద్రరావు పర్యవేక్షణ చేసినారు.ఈ కార్యక్రమములో పెదవేగి డిటిసి డిఎస్పి  ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రామారావు,ఆకుల రఘు, ఆర్ ఐ కృష్ణంరాజు,ఎస్ఐలు విజయ్ కుమార్,శంకర్,ఆర్ ఎస్ ఐ లు,ఏ ఆర్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author