మంత్రి టీజీ భరత్ తో భేటీ
1 min read
జిల్లా అభివృద్ధిపై చర్చించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంట్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు సమావేశం అయ్యారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎంపీ బస్తీపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ శ్యాం బాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆదోని ఇంచార్జి మీనాక్షి నాయుడు, ఆలూరు ఇంచార్జి వైకుంఠం జ్యోతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా నెలలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే, ఇంచార్జి ఇంట్లో అంతా సమావేశమై భోజనం చేసే కొత్త సంప్రదాయానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంట్లో వీరు మధ్యాహ్నం భోజనం చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వీరంతా చర్చించారు.

