హరిత మంత్రాలయం గా చేయడమే లక్ష్యం
1 min read
పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు
ముందుకు వచ్చిన దాత పీవీ బద్రినాథ్ రావు
రూ. 15 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి సుబుబేంద్ర తీర్థులు
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం ను హరిత మంత్రాలయం గా చేయడమే లక్ష్యమని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు స్వామిజీ అన్నారు. మంగళవారం పాణ్యం కు చెందిన ఉజ్వల వేద బృందావన్ అధినేత పీవీ బద్రినాథ్ రావు అనే దాత రూ. 15 లక్షల ఖర్చుతో స్థానిక డీవీజీ అతిథి గృహం వద్ద హైవై రోడ్డు లో డివైడర్ మద్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు శ్రీ కారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అతిథి గృహలు, తులసి వనం, గోశాల, బృందావనం గార్డెన్, సుశమీంద్రతీర్థుల పార్క్, గురు నివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షణించడం, పెంచే బాధ్యత పీవీ బద్రినాథ్ రావు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఉజ్వల వేద బృందావన్ సంస్థ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ట్యాంకర్లకు పూజలు చేసి మొక్కలకు నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ దర్శనం కోసం వచ్చే భక్తులకు, గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం, సుందర, స్వచ్చ, హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడు నెలల్లో మంత్రాలయం పచ్చదనం సంతరించుకుంటుందని అన్నారు. లక్షల్లో ఖర్చు చేసేందుకు ఉజ్వల వేద బృందావన్ అధినేత పీవీ బద్రినాథ్ రావు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అనేక అభివృద్ధి పనులకు దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. దాత బద్రినాథ్ రావు కు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి నారాయణ ఆచార్, ప్రసన్న ఆచార్,ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్ కే శ్రీనివాస్ రావు, సురేష్ కోణాపూర్, వెంకటేష్ జోషి, సుకుమార్, అబోడే త్రీస్టార్ హోటల్ మేనేజర్ రజనీకాంత్, కెనరా బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున, అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు, ట్రాన్స్ కో ఏఈ గోవిందు, ఎంఈవో రాఘన్న, శ్రీనివాసులు, అలీ, రాజు, హజ్మత్ వలి, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్ ఆచార్, నీలకంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


