ప్రభుత్వం నిబంధనలును పాటించని ఎంఈఓ .. హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి
1 min read

ఆదోని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆర్ పి ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ప్రభుత్వం నియమ నిబంధనలను తుంగలో తొక్కిన హలహర్వి ఎంఈఓ ఈరన్న మరియు ఎంపీపీస్ హెచ్ఎం రామకృష్ణ రెడ్డి ని విచారణ జరిపి సస్పెండ్ చేయాలి అన్ని ఈరోజు ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది ఆర్ యూ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ హాలహర్వి మండలంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎంఈఓ తన విద్యాశాఖ అధికారుల ఆదేశాలు లేకుండా హలహర్వి మండల విద్యాధికారి వారి కార్యాలయం లో కార్యాలయ పనులు నిమిత్తం ( జీతాలు చేయటం, సర్వీస్ రిజిస్టర్లు నిర్వహణ ) ఉపాధ్యాయులను వారి వద్దనే అనగా కార్యాలయల్లోనే ( పాఠశాల లకు వెళ్లకుండా ) వున్నారని, అలాంటి పనులకు ఏ మాత్రం టీచర్లను వినియోగించుకోకూడదు అని పాఠశాల కమీషనర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.అలాగే ఎమ్ఈఒ విధులకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అని మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానసారంగా ఫిజులు వసూలు చేస్తున్నా ఎమ్ ఈ ఒ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని కావున ఇప్పటికి అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఎంఈఓ మరియు హెచ్ఎం పై విచారణ జరిపి విధులు నుంచి తొలగించి శాఖ పరమైన చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థ కు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్య శాఖ కమీషనర్ కి ఫిర్యాదు చేస్తాము వారు హెచ్చరించారు.

