NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగం సాధించిన అభ్యర్థికి ఘన సన్మానం

1 min read

హర్షించిన ఎమ్మిగనూరు దూదేకుల సంఘం

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి -2025 లో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ జి టి) గా ఉద్యోగం సాధించిన అభ్యర్థి దూదేకుల సికిందర్ ను దూదేకుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రుక్మాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఖాజా, ఆదోని డివిజన్ హెడ్ కానిస్టేబుల్ జానీ, ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, అభ్యర్థి తల్లిదండ్రులు మన్సూర్, రజియ లు కలిసి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం కష్టపడి చదువుకొని లక్ష్యం పెట్టుకొంటే ఏదైనా  సాధించవచ్చని అన్నారు. అలాగే జిల్లాలో ఉద్యోగం సాధించిన 42 మంది దూదేకులస్థులను ఈ సందర్భంగా హర్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.కే కోచింగ్ డైరెక్టర్ ఆశాలుక్మాన్, ఏఆర్ స్పోర్ట్స్ అధినేత హుమెరా-ముంతాజ్, అభ్యర్థి కుటుంబసభ్యులు ఖాసింబీ, సాగర్, మహమ్మద్, ఆసియ, షఫీ, నూర్జహాన్, జాకీర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author