NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల నుండి వసూలు చేసిన డబ్బులను తక్షణమే తిరిగి చెల్లించాలి

1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అక్రమ రుసుము వసూళ్లను  చేయటాన్ని ఖండిస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మిగనూరు మార్చని సోమప్ప పాఠశాలలో ఆ పాఠశాలలో సుమారు 3,600 మంది విద్యార్థినీలు చదువుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం (2025–26)లో కొత్తగా చేరిన 850 మంది విద్యార్థినీల దగ్గర ప్రతి ఒక్కరి వద్ద నుంచి రూ.150 చొప్పున ఎలాంటి రశీదు లేకుండా వసూలు చేయడం, అలాగే గత సంవత్సరం (2024–25)లో 10వ తరగతి పూర్తి చేసుకున్న 700 మంది విద్యార్థుల వద్ద నుంచి బదిలీ సర్టిఫికెట్ (టిసి) ఇచ్చే పేరుతో రూ.100 చొప్పున మొత్తం రూ.1,97,500 వసూలు చేయడం అత్యంత అన్యాయం అన్నారు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ బడుల మెయింటెనెన్స్ కోసం అంటూ తల్లికి వందనంలో 2వేల రూపాయలు కోతవిదిస్తే మరి ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ పేరుతో చదువుకోడానికి వచ్చిన పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ఈ విధంగా ఆర్థిక భారం మోపడం అప్రజాస్వామికమని, విద్యా హక్కును దెబ్బతీసే చర్య అని వారు తీవ్రంగా విమర్శించారు. తక్షణమే విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, ప్రధానోపాధ్యాయుడు కె. కృష్ణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో విద్యార్థులతో కలసి ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవాసులు, అమర్, అంజి పాల్గొన్నారు.

About Author