పంపులు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి..
1 min read

అధికారుల సమిష్టి కృషితో వేసవిలోప్రజలకు నీతి ఎద్దడి లేకుండా చూడాలి
ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని,కార్పొరేషన్ అధికారులుకు సిబ్బందికి సహకరించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:అందరి సమిష్టి కృషితో రానున్న వేసవిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని కార్పొరేషన్ అధికారులకు సహకరించాలని ఆయన హితవు పలికారు. ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటినీ అందించే దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పంపు హౌస్ షెడ్ నిర్మాణ పనులు, మోటర్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఉన్న నీటి నీటినిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ వేసవిలో నగర ప్రజలు ఎవరూ మంచినీటి సమస్యను ఎదుర్కోకూడదన్న ఉద్దేశ్యంతో సమర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద గండి పూడ్చి వేసే పనులను శరవేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు కాలువల ద్వారా నీటిని పంపుల చెరువులో నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధప్రాతిపదికన పనులను ముందుకు తీసుకువెళ్లడం వలన మంచినీటి సమస్య తలెత్తకుండా చూడగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులను ఆయన అభినందించారు. ఇదే సమయంలో మంచినీటి వినియోగంలో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన మేరకే మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాస్, పాము శామ్యూల్ మున్సిపల్ ఇంజనీర్ సురేంద్రబాబు తదితరులు ఉన్నారు.

