వికసిత్ భారత్ జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
1 min read

రైతు కార్మిక వ్యవసాయ సంఘాల ఆందోళన
పత్తికొండ , న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల ఊపిరి తీసేసిన మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని నూతన జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ రైతు కార్మిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు వ్యవసాయ కార్మికులు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్ రెడ్డి భవనం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేశారు. వ్యవసాయకార్మిక సంఘం మండల అధ్యక్షులు బుజులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నరసన్న సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర పాల్గొని మాట్లాడారు. పేదలకు పట్టెడు అన్నం పెడుతున్న మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరుపుకుండగా ఏకపక్షంగా చట్టాన్ని రద్దుచేసి జి.రాంజీ పథకాన్న తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో వలసలు నివారించి, పేద ప్రజల కడుపునింపుతున్న ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఉపాధి కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలని, అలాగే కొత్తగా తెచ్చిన జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో భరత్ నాయక్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు అలిపిర, మధు, ఉపాధి మేటీలు శికామణి, రసీదు, రామాంజనేయులు, అక్బర్, తిరుపాలు, శ్రీనివాసులు, జయమ్మ, నరసమ్మ, తాయమ్మ, లక్ష్మీదేవి, లాల్ బాషా తదితరులు పాల్గొన్నారు.

