ఆస్పరి మండలం సమస్యలపై కలెక్టర్ ని కలిసిన ఎమ్మెల్యే…
1 min read

ఆలూరు న్యూస్ నేడు: కర్నూల్ లో జిల్లా కలెక్టర్ పి, రంజిత్ భాష కార్యాలయంలో ఆస్పరి మండలం యాట్టకల్లు బ్రిడ్జ్ డ్యామేజ్ అయినందున కలెక్టర్ పి, రంజిత్ భాష కు వినతి పత్రం ఇచ్చిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆస్పరి మండలం యాటకల్లు బ్రిడ్జ్ డ్యామేజ్ అయినందున 10 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది.ఆస్పరి మండలానికి త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది అని కలెక్టర్ పి రంజిత్ భాష కు తెలప్పడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఫ్రీ ఇసుక అని చెప్పి ఇప్పుడు మాత్రం కూటమి నాయకులు యదేచ్చగా ఇసుకను అమ్ముకుంటున్నారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.

