NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ ఏలూరు కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు

1 min read

ఎన్ఎస్ఎస్,రెడ్ క్రాస్, మానవతా ఆధ్వర్యంలో కార్యక్రమం

పాల్గొన్న కాలేజీ ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు,వైస్ ప్రిన్సిపల్ డివివి పణికుమార్

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ మరియు రెడ్ క్రాస్,మానవతా సంస్థ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దే కు  ఆర్.ఆర్.పేటలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి  పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను,తడి,పొడి చెత్తను మరియ కలుపు మొక్కలను తీసివేయు సేవ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా మనమంతా నడుం బిగించాలని ఐక్యంగా విద్యార్థులు ముందుకు సాగారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర రావు,వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి.ఫణి కుమార్,ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ కె.హరిబాబు,ఏవో సిహెచ్ కృష్ణ, రెడ్ క్రాస్ మానవతా సంస్థల సభ్యులు ఆరిపాటి నాగేశ్వర రావు, నిర్మల,రత్నాకరరావు మరియు వాలంటీర్లు  విద్యార్థిని,విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

About Author