NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిపిఐ రాష్ట్ర మహాసభ పోస్టర్  విడుదల

1 min read

హొళగుంద న్యూస్ నేడు:   ఆదోని హొళగుంద రోడ్డు వెయ్యాలని సిపిఐ  మండల కార్యదర్శి బీ.మారప్ప డిమాండ్ చేశారు. హోళగుంద స్థానిక  తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను మండల కార్యదర్శి మారెప్ప ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు కే రంగన్న రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ కృష్ణయ్య  ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఈనెల 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23వ తేదీన వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ బహిరంగ సభకు సభాధ్యక్షులు కే రామకృష్ణ, ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి కె నారాయణ, తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనoనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,జెవి సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పాల్గొంటారని తెలిపారు.       ఆదోని ధనాపురం మీదుగా వెళుతున్న హోళగుంద రోడ్డు వేయించాలని బస్సులు  డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవర్లకు ఆరోగ్యాలు పాడైతున్నాయని అలాగే ఆ రోడ్డు మీద వెళ్లాలంటే ప్రయాణికులు చాలా వసూలు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రైతులు నాగేష్ సిద్ధ లింగ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author