అమ్మా నేనేం చేశాను పాపం..
1 min read

నందికొట్కూర్ ఆస్పత్రిలో బిడ్డను వదిలేసిన వైనం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఆడబిడ్డ పుట్టిందని పసి బిడ్డను ఆస్పత్రిలో వదిలేసిన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సీహెచ్ సీ ఆసుపత్రిలో గురువారం జరిగింది.డాక్టర్లు తెలిపిన వివరాల మేరకు నందికొట్కూరు పట్టణం హాజీ నగర్ కు చెందిన ఓ మహిళ(ఆడబిడ్డకు పెద్దమ్మ ) ఉ 11:50 కి ఆస్పత్రికి వచ్చి ఆడబిడ్డను బెడ్ పైన వదిలిపెట్టి వెళ్లారు.ఇది గమనించిన సిబ్బంది డాక్టర్ కు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాల ద్వారా ఆమెను గుర్తించి అంగన్వాడీ మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు.డాక్టర్ జక్కీ చిన్నారికి చికిత్సను అందించారు.పోలీసుల సమక్షంలో అంగన్వాడీ సీడీపీఓ బిఏ మంగవల్లికి శిశువును అందజేశారు.నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం శిశువును తరలించారు. అక్కడినుండి నంద్యాల శిశుగృహకు పంపించనున్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు శేషమ్మ,ఆశీర్వాదమ్మ,హెడ్ నర్స్ భువనేశ్వరి పాల్గొన్నారు.


