NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత , మానవజాతికంతటికి ఆదర్శనీయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా బి కేంప్ పరిసరాల పాఠశాలకు చెందిన విద్యార్థులకు డ్రాయింగ్(రంగులు వేయుట) కాంపిటీషన్లు ఉంచి వారికి బహుమతులు , సర్టిఫికెట్ల వితరణ   4-9-2026 శుక్రవారం సాయంత్రం విజ్ఞాన మందిరం శ్రీ పార్థసారథి స్వామి దేవాలయం ప్రాంగణంలోని కళ్యాణమండపం లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సత్యనారాయణ శర్మ  మాట్లాడుతూ “శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత , మానవజాతికంతటికి ఆదర్శనీయమని, అందుకే అతన్ని క్రృష్ణం వందే జగద్గురుం అంటారని” తెలిపారు .శ్రీకృష్ణుని బొమ్మకు రంగులు వేసే ఈ పోటీలో 20 పాఠశాలల నుండి 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఎల్ కెజి నుండి 5వ తరగతి వరకు ప్రతి తరగతి వారిగా 10, మొత్తం 70 మంది విద్యార్థులు బహుమతులు పొందారు.సాంస్క్రుతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాల్గొన్న 20 పాఠశాలల్లో రామకృష్ణ, సర్వేపల్లి ,ప్రతిభ ,గుడ్ షెఫర్డ్, శ్రీ విద్యానికేతన్, గురుకుల్, కేశవరెడ్డి ,నేతాజీ, విజేత, రాయలసీమ, గ్రీన్ బన్నీ, ప్రభుత్వ పాఠశాల లు మొదలైనవి ఉన్నాయి.ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోవిందమ్మ ,శ్రావ్య ,ఉపేంద్ర ,జావెద్ ,మాధవి, సుల్తానా, చంద్రశేఖర్ రెడ్డి , నరసింహమూర్తి ,శశిధర్, భాస్కర్ తదితరులు ప్రసంగించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *