మద్దిగుండం చెరువుకు గండి..ఆందోళనలో రైతులు
1 min read

పట్టించుకోని అధికారులు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు మద్దిగుండెం చెరువుకు గండి పడింది.ఆదివారం రాత్రి నుండి కృష్ణ భారీ వర్షాల వల్ల గండిపడిందని జలకనూరు గ్రామ రైతులు అంటున్నారు. వర్షం నీళ్లు అధికంగా రావడంతో మద్దిగుండం చెరువు ఏటి అవతల తూము దగ్గర సోమవారం మధ్యాహ్నం 3:30 నుంచి గండి పడిందని వాటిలో నుండి నీళ్లు అధికంగా గండి నుండి కట్ట లోపలి నుండి బయటి పొలాలకు నీళ్లు భారీగా వస్తున్నాయి.నీళ్లు అధికంగా రావడంతో రైతుల వేసిన పంటలు మొక్కజొన్న, వరి తదితర పంటలు దెబ్బ తింటాయని రైతులు ఆరోపిస్తున్నారు.గండిపడిన తర్వాత అధికారులు ఎవరూ రాలేదని అధికారులు రాకపోవడం పట్ల రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

