సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ
1 min read
రైతులకు ఆధునిక వంగడాల ప్రోత్సాహం
జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద పంపిణీ కార్యక్రమo
హోళగుందన్యూస్ నేడు: జాతీయ ఆహార నూనె గింజల పథకం – 2026-27 వ్యాల్యు చైన్ క్లస్టర్ కింద మండలంలోని చిన్నహ్యాట, సులువోయ్ రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు సబ్సిడీపై టీసీజీఎస్–1694 రకం వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి, ఆలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. చెంగళరాయుడు, హొళగుంద మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ ఆధ్వర్యంలో ఆలూరు సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయ పరిధిలో నిర్వహించారు.ఈ పథకం కింద బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, మద్దికెర సంయుక్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. రైతులకు కొత్త వేరుశనగ వంగడాలను సబ్సిడీపై అందిస్తూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విరూపాక్షి, గ్రామ వ్యవసాయ సహాయకులు తిరుమలేష్, రాజునాయక్, ధరణి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో రైతులు హాజరై విత్తనాలను స్వీకరించారు.

