NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి సిఎస్ఆర్ లీడర్షిప్ సమ్మిట్

1 min read

పాల్గొన్న యువ స్పందన అధ్యక్షులు కురువ సురేంద్ర బాబు                                           

ప్రధానమంత్రి స్టడీ హాల్ను ఏర్పాటు చేయాలని సమ్మిట్ లో కోరిన పత్తికొండ వాసి                   

పత్తికొండ, న్యూస్​ నేడు:  కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన “17వ CSR లీడర్‌షిప్ సమ్మిట్ 2026” (17th CSR Leadership Summit 2026) కు కర్నూలు జిల్లా, పత్తికొండలో సామాజిక సేవలు అందిస్తున్న  యువ స్పందన సొసైటీ ఆహ్వానం పొందింది. ఈ ఆహ్వానం మేరకు యువ స్పందన సొసైటీ అధ్యక్షులు కే సురేంద్ర కుమార్ సమ్మిట్ కు హాజరయ్యారు. సమ్మిట్‌లో భాగంగా “ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల అభివృద్ధిలో CSR పాత్ర” (CSR for Aspirational Districts & Blocks) అనే అంశంపై చర్చించేందుకు అనేక రాష్ట్రాల నుండి CSR రంగంలో ఉన్న ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ స్పందన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు & ప్రెసిడెంట్ కురువ సురేంద్ర బాబు హాజరై వికసిత్ భారత్ లక్ష్యాలపై ప్రసంగించారు.ఈ సందర్భంగా యువ స్పందన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు & ప్రెసిడెంట్ కురువ సురేంద్ర బాబు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత భారత్ 2047’ లక్ష్యంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు సాంకేతిక విద్య, ఉపాధి కల్పన మరియు డిజిటల్ అక్షరాస్యతను అందించడంలో యువ స్పందన సొసైటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దీనిలో భాగంగా గ్రామీణాభివృద్ధికై పత్తికొండ కేంద్రంగా గత 10 సంవత్సరాలుగా  100కు పైగా స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా విద్య, ఆరోగ్యం మరియు వికలాంగుల (PwDs) సాధికారత కోసం కృషి చేస్తున్నామని సమ్మిట్ లో వివరించారు.  కర్నూలు జిల్లా వంటి ప్రాంతాల్లో CSR భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో స్టడీ హాల్స్ మరియు స్కిల్ సెంటర్లను మరింత విస్తృతం చేసేందుకు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) నిధుల సహకారం అవసరమని.

About Author