ఆదోని జిల్లా సాదించే వరకు మన పోరాటం ఆగదు..
1 min read
హోళగుందన్యూస్ నేడు: ఆదోని జిల్లా సాదించే వరకు మన పోరాటం ఆగదు…బిసివై పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి ఎల్లార్తి అర్జున్ వాల్మీకిఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఆదోనిని ఖచ్చితంగా జిల్లా చేయాల్సిందే అంటూ ఈ రోజు ఆలూరులో జరుగుతున్న 34వ రోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నీళ్ళు నిధులు, వైధ్య,విద్య,రోడ్లు, పరిశ్రమలు,ప్రాంతాలకు అభివృద్ధి కోసం ఆదోనిని జిల్లా చేయకపోతే,కరువు వలసలు ఆగడానికి ఆదోనిని జిల్లాగా ప్రకటించకపోతే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఎదురు దెబ్బ కొడతామని ఆలూరు జేఏసీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.త్వరలోనే ఆదోనిని జిల్లా ప్రకటనపై శాశ్వతమైన నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోకపోతే అసెంబ్లీ ముట్టడి మరియు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి, మంత్రుల, ఎమ్మెల్యేల,ఎంపీల ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడుతామని కూటమి నాయకులకు కర్నూలు జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి ఎల్లార్తి అర్జున్ వాల్మీకి డిమాండ్ చేయడం జరిగింది.

