ఘనంగా ముగ్గుల పోటీలు, సంబరంగా సంక్రాంతి వేడుకలు
1 min read

ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి రోజున బుధవారం పత్తికొండలోని చదువుల రామయ్య భవనం ఆవరణంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య ల ఆధ్వర్యంలో ఉత్సాహవంతమైన వాతావరణంలో ముగ్గుల పోటీలను నిర్వహించి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్నేతలుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాళ్లు భ్రమరాంబ, సరస్వతి, లలిత, ఎస్ టి యు మండల కార్యదర్శి మారుతి లు వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి లక్ష్మీ నిఖిత కు 5 వేల రూపాయలు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణి చేతుల మీదుగా బహుమతి అందజేయగా, రెండవ బహుమతి బి. అఖిల కు 3 వేల రూపాయలు ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రామచంద్రయ్య చేతుల మీదుగా అందజేశారు. మూడో బహుమతి జ్యోతి, అరుణ ల కు 2 వేల రూపాయలు, ఏపీ మహిళా సమాఖ్య మండల అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, చంద్రమ్మ చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పి. భీమ లింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి యు. కారుమంచి, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు గురుదాస్, కారన్న, కృష్ణయ్య, నెట్టికంటయ్య, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి అల్తాఫ్, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి, చంద్రమ్మ, ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, కుంపటి నారాయణ, బలరాం, ప్రజా సంఘాల మాదన్న సిద్దు తదితరులు పాల్గొన్నారు.

