NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గొప్ప దార్శనికుడు నెహ్రు : ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రు జయంతి ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం  నెహ్రు చిత్ర పటానికి విద్యార్థిని లతో కలిసీ పూలమాల వేసి అనంతరంవిద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి. ఆయన 1889 నవంబర్ 14న జన్మించారు. నెహ్రూ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. జవహర్‌లాల్ నెహ్రూ జీవితంలో అత్యంత ముఖ్యమైన నైతిక నిర్ణయం ఆయన ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడటం. స్వాతంత్ర్య పోరాటంలో అహింస పాటిస్తూ గాంధీ మార్గదర్శకత్వాన్ని అనుసరించడం, అహింసపరమైన స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఆయనకు ఎంతో కీలక నిర్ణయం అయింది. అలాగే నెహ్రూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అత్యంత ప్రాముఖ్యంగా భావించి, భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించడం ఆయన జీవితంలో గొప్ప నైతిక సారాన్ని ప్రతిబింబించేది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం పెట్టుబడి దారీ, సామ్యవాద అనే రెండు కూటములుగా విడిపోతే వాటిలో చేరకుండా అలీనా విధానాన్ని అనుసరించి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మన దేశానికీ శ్రేయస్కరం భావించి అమలు చేసెను. నెహ్రు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం పిల్లలకు మంచి విద్య మరియు విలువలు నేర్పాలని నెహ్రూ  నమ్మేవారు. అందుకే ఆయన జన్మదినాన్ని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు అని తెలిపారు.ఈ కార్యక్రమం లో  ఎన్ఎస్ఎస్ పిఓ  నవీన పాటి  ,అధ్యాపకులురామకృష్ణయ్య, ఓబులేసు, మద్దిలేటి, వెంకటరమణ, ముస్తాక్, మురళి మోహన్, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మంజునాథ్, వన్నూర్, సురేష్ మరియు ఎన్ఎస్ఎస్  వాలంటీర్స్ రమ్య, అప్సనా, సానియా తదితరులు పాల్గొన్నారు.

About Author