ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి
1 min read

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హోమ్ శాఖ మంత్రికి,డిజిపికి లేఖ రాసిన ఆర్టీసి ఇ.యు నాయకులు.
విజయవాడ , న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగాప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పధకం అమలు పరచడంలో కండక్టర్లు డ్రైవర్లకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా స్త్రీ-శక్తి పధకాన్ని విజయవంతం చేస్తువున్నా రోజు రోజుకు కొంత మంది దురుసు స్వభావం కలిగిన ప్రయాణీకులు ఆన్ డ్యూటీ సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోయినవి. భౌతిక దాడులు చేస్తున్న వారిపైన పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని విధులలో వున్న ప్రభుత్వ ఉద్యోగి పైన దాడులు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లను మోపి ఎఫ్ఐర్ నమోదు చేసి రిమాండ్ కు తరలించేలా ప్రభుత్వం పోలీసుశాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం గౌఃహోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత కి,డిజిపి కి లేఖ రాసి మెయిల్ ద్వారా ఆదివారం పంపించామని త్వరలోనే ఇ.యు రాష్ట్ర కమిటిగా హోమ్ మంత్రిని, డిజిపిని కలిసి చర్చిస్తామని ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.గత సంవత్సరం ఆగస్టు 15 నుండి స్త్రీ-శక్తి పధకం అమలు అయినప్పటి నుండి సిబ్బందిపై ఇప్పటి వరకూ వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నా పోలీసు డిపార్ట్మెంట్ నుండి శాఖా పరమైన కఠినమైన చర్యలు తీసుకోక పోవడం వలన,ఆదిశగా ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిపైన ఇంకా బౌతిక దాడులు పెరుగుతున్నాయని, శనివారం పల్నాడు జిల్లా నర్సారావుపేట డిపోకి చెందిన మహిళా కండక్టర్ పై ఒక మహిళా ప్రయాణికురాలు బస్సు ఆపమన్న చోట బస్సు ఆపేందుకు వీలుకాక ట్రాఫిక్ అడ్డంకి లేని దగ్గర బస్సు ఆపేందుకు ముందుకు వెళ్లి బస్సు ఆపారని అందుకు ఆ ప్రయాణికురాలు అగ్రహించి మహిళా కండక్టర్ పై దాడిచేయడమే కాకుండా ఆ కండక్టర్ వద్ద ఉన్న టిమ్ మిషన్ లాక్కొని బస్సు బయటకు విసిరివేసి డ్యామేజ్ చేసినదని ఆమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండిమాండ్ చేసారు.ఆర్టీసి మేనేజ్ మెంటు అన్ని బస్సుల్లో, బస్సు స్టాండ్ లలో “పోలీసు వారి హెచ్చరిక ఆన్ డ్యూటీలోని సిబ్బందిపై దాడులు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షార్హులు” చర్యలు తీసుకుంటాము” అని ప్రయాణీకులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని గత నాలుగు నెలలు నుండి ఇప్పటికే అనేకసార్లు ఆర్టీసి వి.సి & యం.డి ద్వారకా తిరుమలరావు కి ఇ.యు రాష్ట్ర కమిటి తరుపున లేఖ ఇచ్చామని మరలా సోమవారం ఆర్టీసి యం.డి ని కలిసి దాడుల విషయం చర్చిస్తామని రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

