NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర విద్యాసంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:     నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రవీంద్ర విద్యాసంస్థల్లో పతాకావిష్కరణ గావించబడింది.రవీంద్ర విద్యానికేతన్ ఐసి విభాగంలో మరియు రవీంద్ర జూనియర్ కాలేజ్, రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలల్లో  రవీంద్ర విద్యా సంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ గారు పతాకావిష్కరణ గావించి విద్యార్థులతో మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితంగా మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛను భావితరాలకు అందిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచే బాధ్యత విద్యార్థులైన మీ అందరి పైన ఎంతైనా ఉందన్నారు. మనము  మహాత్మా గాంధీ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం  వంటి ఉన్నత మూర్తులను ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.రవీంద్ర ప్రైమరీ స్కూల్ విభాగంలో రవీంద్ర విద్యా సంస్థల వైస్ చైర్మన్ జి. వంశీధర్ , రవీంద్ర విద్యానికేతన్ లో ప్రొఫెసర్ జి. శశి కుమార్ , రవీంద్ర పబ్లిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ విభాగంలో డాక్టర్ ఎం. జయలక్ష్మి, రవీంద్ర గ్లోబల్ స్కూల్ లో పాఠశాల కో సిఇఓ జి. సుప్రియ,జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషశ్రీ ల పతాకావిష్కరణ గావించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

About Author