రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఉన్నతికి పాటుపడుదాం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను నెరవేరుస్తూ దేశ ప్రజలు అందరూ ఆనందంగా ఆత్మ గౌరవంతో సమానత్వంతో జీవించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఉన్నతికి పాటుపడుదాం మన భారతదేశ పౌరులందరు 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే ప్యాపిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు ట్రాయిని డి.ఎస్.పి రాజ సింహరెడ్డి, సిఐ వెంకటరామిరెడ్డి ఎస్ఐ నాగార్జున జెండా ఆవిష్కరించారు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారు భారతి, ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్, మహిళ సమైక్య కార్యాలయంలో మహిళ అధ్యక్షురాలు గోల్ల సరోజ, ఏపిఎం క్రిష్ణమూర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రాహుల్, మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి లక్ష్మీదేవి, వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివకుమార్ గౌడ్, ఎం ఆర్ సి కార్యాలయంలో విద్యాధికారులు వెంకటేశ్వర నాయక్ ,మహేశ్వర్ రెడ్డి, అలాగే సచివాలయం కార్యాలయంలో ఆ కార్యాలయం సంబంధించి ఉద్యోగులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల లు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

