వర్షాల ప్రభావంతో జడ్పీ రహదారుల స్థితిగతులపై సమీక్ష
1 min read
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ
ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు అధికారులు చేపట్టాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్పీ రహదారుల స్థితిగతులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాజరయ్యారు.తాజా వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై వివరాలు తెలుసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ రిపేర్ పనులు చేపట్టాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు, అంతర్గత రహదారులు, పంటల రవాణా మార్గాలు ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తులను వేగవంతం చేయాలని సూచించారు.అలాగే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాల పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రతి హాబిటేషన్‌కి సమయానికి రహదారి కనెక్టివిటీ ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.అధికారులు ఇప్పటికే అత్యవసర పనులు ప్రారంబించామని, ఫీల్డ్ టీంలు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.జిల్లా ప్రజలకు ఎంతో కీలకమైన రహదారి సౌకర్యాల విషయంలో జడ్పీ చైర్‌పర్సన్ ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమస్యలు వెంటనే పరిష్కరించేందుకే ఈ సమీక్ష ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

