NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూములు,హాళ్లు అద్దెకు ఇవ్వరాదని నోటీసులు జారీ

1 min read

బెల్లపు ఊట నాటుసారా ధ్వంసం:ఎక్సైజ్ సీఐ 

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  గురువారం నూతన సంవత్సరం సందర్భంగా లాడ్జిల్లో రూములు,హాళ్ళు ఎవరికీ కూడా అద్దెకు ఇవ్వకూడదని లాడ్జిల యజమానులకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో లాడ్జి యజమానులకు,ఫంక్షనల్హాల్ యజమానులకు నూతన సంవత్సరం సంధర్భంగా  అనధికారికంగా మద్యం సేవించుటకు అనుమతి ఇవ్వడం చట్టరీత్యా నేరం కావున అటువంటి కార్యకలాపాలు చేసే వ్యక్తులకు   బుధవారం రాత్రి రూములు, హాళ్లు అద్దెకు ఇవ్వకూడదని బుధవారం మధ్యాహ్నం అధికారులు యజమానులను హెచ్చరిస్తూ నోటీసులు అందజేశారు.అసాంఘిక వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు.అదేవిధంగా పట్టణంలోని షికారి పేటలో ఆకస్మికంగా చేసిన దాడిలో నాటుసారా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న 300 లీటర్లు బెల్లం ఊట  మరియు 10 లీటర్ల నాటు సారాయిని గుర్తించి ఎక్సైజ్ శాఖ అధికారులు వాటిని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్ రామాంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు స్టేషన్ ఎస్ఐ భాష్యం శ్రీనివాసులు,కర్నూలు ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐ మారుతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author