భారత మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు వేదికగా న్యూమెరోస్ మోటార్స్ ‘వైబ్ మూవర్స్’ ప్రచారం
1 min read
తొలి విడతలో ఒలింపియన్ ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి, జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ యశస్విని ఘోర్‌పడే, జాతీయ ఫుట్సల్ క్రీడాకారిణి మిథిలా రమణి
క్రీడాకారిణుల పోరాట పటిమ, పట్టుదల, విజయ ప్రస్థానాలను ఆవిష్కరించే కథనాల పరంపర
ముగ్గురు క్రీడాకారిణులకు ఎన్-ఫస్ట్ వాహనాలను బహూకరించిన సంస్థ
హైదరాబాద్, న్యూస్ నేడు : భారత మహిళా క్రీడాకారిణుల విజయాలను, వారి ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు న్యూమెరోస్ మోటార్స్ ‘వైబ్ మూవర్స్’ పేరుతో ప్రత్యేక కథనాల పరంపరను ప్రారంభించింది. మరింత గుర్తింపు పొందాల్సిన క్రీడాకారిణుల విజయ ప్రస్థానాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఒలింపియన్ ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి, జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ యశస్విని ఘోర్‌పడే, జాతీయ ఫుట్సల్ క్రీడాకారిణి మిథిలా రమణి తొలి విడతలో చోటు దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారిణుల ప్రయాణాలను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయనున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు క్రీడాకారిణుల ప్రతిభ, పట్టుదల, కృషికి గుర్తింపుగా న్యూమెరోస్ సంస్థ ఒక్కొక్కరికి ఒక ఎన్-ఫస్ట్ వాహనాన్ని బహూకరించింది.‘వైబ్ మూవర్స్’ కార్యక్రమం కేవలం పతకాలు, పురస్కారాలకే పరిమితం కాకుండా.. క్రీడాకారుల విజయాల వెనుక ఉన్న కఠోర శ్రమ, శిక్షణ, గాయాలు, ఎదురుదెబ్బలు, సవాళ్లను అధిగమించిన తీరు వంటి అంశాలను ఆవిష్కరిస్తుంది. న్యూమెరోస్ రూపొందిస్తున్న క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (సీయూవీలు) కూడా ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. సంప్రదాయ వాహనాల దృఢత్వం, బలంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను ఈ ద్విచక్ర వాహనాలు అందిస్తాయి.మిథిలా రమణి: ఇంజినీరింగ్ చదివి, ఆ రంగంలో స్థిరపడాలనుకున్న మిథిలా.. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫుట్‌బాల్, ఫుట్సల్ క్రీడాకారిణిగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. 2026 జనవరిలో మాల్దీవులతో జరిగిన భారత్ తొలి మహిళల అంతర్జాతీయ ఫుట్సల్ మ్యాచ్‌లో ఆమె తొలి గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 11–1తో విజయం సాధించింది. అనంతరం జరిగిన తొలి సాఫ్ మహిళల ఫుట్సల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.మిథిలా రమణి మాట్లాడుతూ.. “స్థానిక మైదానాల నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకోవడానికి నాకు పదేళ్లకు పైగా సమయం పట్టింది.న్యూమెరోస్ మోటార్స్ గురించిన్యూమెరోస్ మోటార్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. భారతీయ అవసరాలకు అనుగుణంగా, దేశంలోనే రూపకల్పన చేసి తయారు చేసిన క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (సీయూవీలు) ద్వారా రవాణా రంగంలో సరికొత్త విభాగాన్ని అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ ద్విచక్ర వాహనాల దృఢత్వం, వినియోగ ప్రయోజనాలను ఎలక్ట్రిక్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలతో మేళవిస్తూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వినూత్న వాహనాలను రూపొందిస్తోంది.క్రాసోవర్ డిజైన్ నిర్మాణంతో రూపొందించిన న్యూమెరోస్ సీయూవీలు పటిష్ఠమైన ఇంజినీరింగ్, సరళమైన ప్రయోజనాత్మక రూపకల్పన, బహుముఖ వినియోగ సౌకర్యాలతో దృఢమైన పనితీరును అందిస్తాయి. పని అవసరాలకు, రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. న్యూమెరోస్ ప్రొటెక్ట్ సేవల ద్వారా నమ్మకమైన నిర్వహణ, వాహనాల నిరంతర వినియోగానికి భరోసా కల్పిస్తోంది.


