NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గొల్లాయిగూడెంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి కి సారెలు,బోనాలు సమర్పణ

1 min read

తెలంగాణ సాంస్కృతితో బోనాలు అందజేసిన కేరళ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూద్రి

గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నాం

ఆలయ వ్యవస్థాపకలు, ధర్మకర్తకె. బ్రహ్మం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు జిల్లా ప్రతినిధి:స్థానిక గొల్లయిగూడెం సన్ సిటీ దగ్గర శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం అత్యంత ఘనంగా అమ్మవారికి ఆషాడ మాసన్ని పురస్కరించుకొని సారేల సమర్పణ కార్యక్రమం ఘనంగా స్థానిక 18వ డివిజన్ ప్రజలు, వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సమర్పించారు. భక్తులకు కనకదుర్గ అమ్మవారు శాకాంబరిగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్విరామంగా వేదమంత్రాలతో భక్త బృందం మరియు భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఆలయ వ్యవస్థాపకులు,ధర్మకర్త బ్రహ్మం మరియు కమిటీ సభ్యులచే అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ సంస్కృతి పురస్కరించుకొని కేరళ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూద్రి హేలాపూరి  నగరంలో ఎవరూ చేయని విధంగా బోనాలు వారి నీ ఇంటి నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author