NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగా కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా అధికారులు పనిచేయాలి

1 min read

యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం – ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న యోగా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, యోగా అసోసియేషన్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యోగ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై యోగా ప్రచార కార్యక్రమాలు, ప్రజల్లో యోగాపై అవగాహన పెంపు చర్యలు, నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7 నుండి 21 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొని విశేష స్పందన చూపారని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక థీమ్‌లను కేటాయించగా, నంద్యాల జిల్లాకు యోగా అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈనెల 17వ తేదీ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించియున్నారని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగా ప్రాముఖ్యతను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు మహానంది దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సుమారు 1,500 మంది పాల్గొనే యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘పురమిత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు. అదేవిధంగా, పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రజా ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్లాస్టిక్ రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఆయుష్ కోఆర్డినేటర్ డా. యశోధర, డిఎస్డిఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author