రసాయిన శాస్త్రాల్లో అభివృద్ధి, పరిశోధనావకాశాలపై ఒకరోజు జాతీయ సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు గడించిన శాస్త్రవేత్తల మార్గదర్శనం రాయలసీమ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు హర్షం వ్యక్తంచేశారు. ఫిజిక్స్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ సెనేట్ హాలులో భౌతిక మరియు రసాయిన శాస్త్రాల్లో అభివృద్ధి, పరిశోధనావకాశాలపై ఒకరోజు జాతీయ సదస్సును జ్యోతిప్రజ్వలనతో ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISC), బెంగళూరుకు చెందిన ఆచార్యులు, శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ సహకారంతో వర్సిటీలో ఇలాంటి స్ఫూర్తివంతమైన కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వివరించారు. నూతన విద్యావిధానం 2020 ని అనుసరించి బోధన, పరిశోధనల్లో వివిధ విభాగాలమధ్య సమన్వయం సాధించాల్సిన అవసరముందని ఆచార్య బసవరావు అభిప్రాయపడ్డారు.అనంతరం అతిథులను యూనివర్సిటీ అధికారులు సన్మానించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో వివిధ కళాశాలలనుండి హాజరైన విద్యార్థులు, అధ్యాపకుల సందేహాలను నిపుణులు నివృత్తిచేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్, IQAC కోఆర్డినేటర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ఫిజిక్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ జి. శివశంకర్ యాదవ్, డాక్టర్ రాజశేఖర్ తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, రీసర్చ్ స్కాలర్స్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

