శనగ రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించదా..?
1 min read

నేడు రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు
వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్
మిడుతూరు, న్యూస్ నేడు: శనగ రైతుల గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించదా అని వైఎస్ఆర్సిపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.ఈ సందర్భంగా శుక్రవారం భరత్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు న్యాయం చేయలేని పరిస్థితి నేడు ప్రభుత్వానికి ఏర్పడిందని గత ప్రభుత్వ హయాంలో శనగలు మద్దతు ధర క్వింటాలు 8 వేల రూ.లు ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో 5,650 రూ.లు మద్దతు ధర ఉందన్నారు. మరి ఏ ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతు ధర కల్పిస్తుందనే వాటి గురించి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.శనగ దిగుమతి సుంకాలు పెంచకపోతే దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కర్నూలు,నంద్యాల తదితర జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో సుమారు 9.2 లక్షలు ఎకరాలు సాగు చేస్తున్న శనగ రైతులు ఆరు లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుందని వరుసగా మూడో ఏటా 2026 రభీలో కూడా రైతులు నష్ట పోవాల్సిందేనా అని భరత్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించి రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

