NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ ముద్రతో పాస్ పుస్తకాలు

1 min read

రైల్ అండర్ బ్రిడ్జ్ మరియు రైల్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణాల అనుమతులకు చర్యలు చేపట్టండి

ప్రజల సంతృప్త స్థాయి లో ప్రభుత్వ సేవలు ఉండాలి

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్

కర్నూలు,  న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి రాజ ముద్ర ఉన్న పాస్ పుస్తకాల పంపిణి , రైల్వేల ఆర్‌ఓబిలు/ఆర్‌యూబిల కు అవసరమైన  భూసేకరణ పై  జిల్లా కలెక్టర్ లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.శుక్రవారం సాయంకాలం ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్ల తో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజముద్ర కలిగిన పాసుపుస్తకాల పంపిణీ ఈరోజు నుండి తొమ్మిదవ తారీకు వరకు కొనసాగించాలని, అలాగే ప్రతి నెల పాస్ పుస్తకాల పంపిణీ చేసే చర్యలు కొనసాగించి డిసెంబర్ నెల లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ,డి.ఆర్.ఓ వెంకటనారాయణమ్మ ,ఆర్ అండ్ బి ఎస్ ఈ వేణుగోపాల్ రెడ్ది , రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సత్యనారాయణ ,  ఎస్సీ ఆర్డబ్ల్యూస్ మనోహర్ ,డి టి సి శాంతకుమారి  , దేవాదాయ శాఖ ఏ.సి.సుధాకర్ రెడ్ది ,డి ఏం హెచ్ ఓ భాస్కర్,జి జి హెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిసి హెచ్ ఎస్ జఫరుల్లా,పి ఆర్ డి ఈ శ్రీనివాసులు , సిపిఓ భారతి ,   అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

About Author