భూమిపై సంపూర్ణ హక్కులు భూమి యజమానికే చెందుతాయి
1 min read
– సబ్ కలెక్టర్ అజయ్ కుమార్
ఆదోని, న్యూస్ నేడు: రైతుల భూమి పై సర్వ హక్కులు భూమి యజమానికె చెందుతుందని ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి)అజయ్ కుమార్ పేర్కొన్నారుశుక్రవారం ఆదోని డివిజన్ లోని ఆదోని మండలం అరేకల్ గ్రామం, గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ హక్కుల పత్రాల స్థానంలో రాజముద్ర తో నూతనంగా రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన వాటికి ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్ పాల్గొని పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.., భూమిపై ఉన్న సర్వ హక్కులు భూమి యజమానికే చెందుతాయని, రైతుల భూ హక్కులను భద్రపరిచే ఉద్దేశంతోనే ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని అన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులకు భద్రత, నమ్మకం కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభించడంతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.

