పత్తికొండలో కరువు మండలంగా ప్రకటించాలి
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా రైతులు వేసిన పత్తి, ఉల్లి, టమోటా, వేరుశనగ, ఆముదం పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ప్రకటించి రైతులను ఆదుకోవాలని బిజెపి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ నేపథ్యంలో పత్తికొండ బిజెపి మండల అధ్యక్షుడు కర్ణం నరేష్ అధ్యక్షతన, బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ,ప్రస్తుతం రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ప్రతి రైతుకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలి. పత్తికొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపరిశీలన చేయించాలి. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ నిధులు విడుదల చేయాలి. నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు అందించి తదుపరి సీజన్లో పంటలు వేసుకునేలా చేయాలి,” అని డిమాండ్ చేశారు.అదే విధంగా, వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పత్తికొండ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ పూనా మల్లికార్జున మాజీ స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ దండి మల్లికార్జున ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య రాతన రవి జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరయ్య ఆచారి పందికోన గోపాల్ లీగల్ సెల్ కన్వీనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

