NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా వైధ్య మరియు ఆరోగ్య శాఖాదికారి  డాక్టర్ ఎల్​.బాస్కర్  జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా వాతావరణ మార్పుల వలన ఉదయం ఎండ కనిపించినా కాసేపటికే  ఆకాశాన్ని మొబ్బులు కమ్ముకుని చిరుజల్లులు ప్రారంబం అవుతున్నాయి  ఈ కారణంగా వాతావరనంలో వచ్చు మార్పులకు ప్రజలు అప్రమత్తంగా ఉండి డెంగ్యు, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వారి ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలను మరియు కిటికీలకు మెస్సులను మరియు చిన్నపిల్లలకి కాళ్ళు, చేతులు నిండుగా ఉండేవిదంగా దుస్తులను దరింపజేయాలని మరియు దోమలు ఇంటిలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మరియు కాచి, చల్లార్చిన నీటిని ఇంటిలో ఉన్నవారు. వైద్యాదికారులు వైద్య సిబ్బంది ప్రజలకు పరిసరాల ప్రాముక్యత గురించి ఆరోగ్యానికి సంబందించిన తగు సలహాలను ప్రజలుకు అవగాహన కల్పించాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రతి రోజు ఫీవర్ సర్వే నిర్వహించి అవసరమైన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దగ్గరుండి పంపించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది వైద్యాదికారులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని తెలియజేశారు.

About Author