మారుతి నగర్ కు శాశ్వత మార్గం చూపుతాం..
1 min read

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి-ఆసుపత్రి తనఖీ..
వాగులను పరిశీలించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మొంథాన్ తుఫాన్ వర్షాల వల్ల నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో వర్షపు నీళ్ళు మంగళవారం రాత్రి నుండి కాలనీలోకి అధికంగా నీళ్లు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం ఉదయం మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ మరియు తహసిల్దార్ శ్రీనివాసులుతో కలిసి కాలనీలో వర్షపు నీళ్లను పరిశీలించారు. నీళ్లు సక్రమంగా వెళ్లేందుకు పోక్లేయిన్ ద్వారా చెత్త చెదారాన్ని తొలగించి నీళ్లు వెళ్లే విధంగా చేయించారు.వర్షం నీళ్ల వల్ల మారుతి నగర్ చాలా ఇబ్బందులకు గురి అవుతుందని వీటికి కాల్వలను వెడల్పు చేసి నీళ్లు వెళ్లే విధంగా శాశ్వత మార్గం చూపాలని కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.తర్వాత సీహెచ్ సీ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే తనకు చేశారు.సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఉండాలని తప్పనిసరిగా వైద్యులు మరియు సిబ్బంది విధులకు హాజరు అవుతూ ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే అన్నారు.పట్టణంలో అంగన్వాడీ ఐసిడిఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.జూపాడు బంగ్లాలో ప్రవహిస్తున్న నీళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు.పాములపాడు మండలం చెలిమిళ్ల మరియు దుద్యాలలో ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిని ఎమ్మెల్యే పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సీడీపీఓ మంగవల్లి,ఏఈ దినేష్,వార్డు ఇన్చార్జి తాటిపాటి అయ్యన్న,క్లస్టర్ ఇన్చార్జి షకీల్ అహ్మద్,పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

