కౌతాళం లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
1 min read
– జనసేన మండల నాయకులు రామాంజనేయులు
బైక్ ర్యాలీ, కేక్ కట్, నాయకులకు ఘన సన్మానం
కౌతాళం, న్యూస్ నేడు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కౌతాళం మండల కేంద్రంలో మంగళవారం అట్టహాసంగా జరిగాయి,మంత్రాలయం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వాల్మీకి బి. లక్ష్మన్న , ముఖ్య అతిథిగా,కౌతాళం గ్రామ శివారు నుండి మెయిన్ బజార్ మీదుగా ఎంపీడీవో ఆఫీస్ వరకు జనసేన. నాయకులు బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సభ జరిగింది.ఈ సభకు అధ్యక్షులుగా ఎస్. రామాంజనేయులు వ్యవహరించగా, ఎస్. చిన్న ఆర్గనైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పేరు మీద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు.సభలో వాల్మీకి లక్ష్మన్న మాట్లాడుతూ – “రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి, గ్రామాలు అభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ కృషే కారణం. పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలో ఉండటం వల్ల గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల నాయకులు బి.వి. రవిచంద్ర, లోకేష్, కౌతాళం మండల జనసేన నాయకులు రాంబాబు, బీబీసీ చిన్న, రాంప్రసాద్, ఎర్రిస్వామి, తిక్కయ్య, నరసింహులు, ఉదయ్ ఆచారి, రంగనాథ్, ఆకాష్, సిద్దేశ్, ప్రకాష్, చంద్ర, మల్లికార్జున, అంజి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



