ఒకరోజు ముందే పెన్షన్ల పండుగ
1 min read

లబ్ధిదారులు కళ్ళల్లో ఆనందం
హోలగుంద న్యూస్ నేడు: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. మార్చి నెల 1 వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28 నే పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది.నెల తిరగకముందే చేతికి నగదు అందడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు పంపిణీతో వాడ వాడలా పెన్షన్ల పండుగ కనిపిస్తోంది.ఈ పెన్షన్ల పంపిణీలో ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాలతో హోళగుందలోని ఈ బి సి కాలనీలో – 39,40 బూత్,సినిమా రోడ్డు – 38 బూత్,చిన్న మసీద్ కాలనీ – 35 బూత్ లలో టీడీపీ మండల కన్వీనర్ తిప్పయ్య, కో కన్వీనర్ జాకీర్, సీనియర్ నాయకులు ఎర్రిస్వామి, పంపాపతి,మండల మైనార్టీ అధ్యక్షుడు మోయిన్,అంజి, బుడగ జంగాల రామాంజిని,వైకుంఠం యువసేన గిరి,కో క్లస్టర్ ఇంచార్జ్ రారావి సిద్దు,వెంకటేష్,బసవ,బూత్ కన్వీనర్లు వలి బాషా, శాలి అమాన్,బషీర్,తాహెర్ సచివాలయ సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేశారు.ఆదివారం సెలవు ఉన్నా మా ఇబ్బందులు గుర్తించి ముందే పెన్షన్ అందించడం చాలా సంతోషంగా ఉంది అని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని,ఆలూరు టిడిపి ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతిని, కుటుంబ ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.


