NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

1 min read

పెదవేగి పిహెచ్ సి ఆరోగ్య అధికారిణి డాక్టర్:మాధవి

 హెచ్ పి వి వ్యాక్సిన్ పట్ల వయసులో ఉన్న బాలికలకు క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని పెదవేగి పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్: మాధవి పేర్కొన్నారు. మంగళవారం “”ఆశా డే” సందర్భంగా పీహెచ్సీ ఆవరణలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్:మాధవి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు ఫ్యామిలీ ప్లానింగ్ పై ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తగు సూచనలు తెలియజేయాలని ఆమె అన్నారు. జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి  గోవిందరావు మాట్లాడుతూ అంటూ వ్యాధుల నిర్మూలనలో ఆరోగ్య, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. అలాగే ఇటీవల ప్రారంభించిన హెచ్ పి వి వ్యాక్సిన్ పట్ల  వయసులో ఉన్న బాలికలకు అవగాహన కల్పించి వారిని క్యాన్సర్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యామిని, అలివేలు మంగ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author