NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ పన్నుల తగ్గింపు పై ప్రజలకు అవగాహన  కల్పించాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా జీఎస్టీ పన్నుల  తగ్గింపు పై ప్రజలకు అవగాహన  కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం ఆలూరు మండల కేంద్ర పరిధిలోని గ్రామ సచివాలయం – 2 ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయాల ద్వారా  ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని  ఆరా తీశారు. త్రాగునీరు, శానిటేషన్, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామ ప్రజలకు జిఎస్టి (GST) పన్నుల తగ్గింపులపై  పూర్తిగా అవగాహన కల్పించాలని సచివాయల సిబ్బందికి సూచించారు. ఈ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయని, వాటిని కఅరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author