మైక్రో బయాలజీ విభాగానికి ఎన్.ఏ.బి.ఎల్ గుర్తింపు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కె.యం.సి మైక్రోబయాలజీ హెచ్ఐవి టెస్టింగ్ ల్యాబోరేటరీ కి ప్రతిష్టాత్మక ఎన్.ఏ.బి.ఎల్ గుర్తింపు”…. కర్నూల్ మెడికల్ కాలేజీ లోని మైక్రోబయాలజీ విభాగము యందలి ఎస్.ఆర్.ఎల్ ల్యాబ్ లో నిర్వహించే హెచ్.ఐ.వి పరీక్ష కు దేశవ్యాప్త ప్రతిష్టాత్మక ఎన్.ఏ.బి.ఎల్ అక్రిడిటేషన్ లభించడం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ హర్షం వ్యక్తం చేస్తూ మైక్రో బయాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు. ఎన్.ఏ.బి.ఎల్ గుర్తింపు వచ్చిన సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ని మైక్రోబయాలజీ విభాగాధిపతి, సిబ్బంది కలిసిన సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మైక్రో బయాలజీ భాగంలోని హెచ్.ఐ.వి పరీక్షకు ఎన్ఏబిఎల్ నూతన గైడ్ లైన్ ప్రకారం గుర్తింపు లభించడం అంటే అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షలు నిర్వహించే వారికే ఈ గుర్తింపు లభిస్తుందని అలాంటి గుర్తింపు కర్నూల్ మెడికల్ కాలేజీకి రావడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా మైక్రో బయాలజీ విభాగాధిపతి & వైస్ ప్రిన్సిపల్ డా. రేణుకా దేవి, సిబ్బందికి ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. మైక్రో బయాలజీ బాగాధిపతి మాట్లాడుతూ ఎన్.ఏ.బి.ఎల్ అక్రిడేషన్ ISO 15189:2022 గుర్తింపు రావడం అంటే విభాగం పని తీరుకు నిదర్శనం అని ప్రతి పరీక్షను నూరు శాతం నిర్దేశించిన ప్రమాణాలు ప్రకారం ఎస్.ఆర్.ఎల్ ల్యాబ్ పని చేస్తుంది అని తెలిపారు. ప్రిన్సిపల్ సహకారంతో సూపర్ స్పెషాలిటీ డి.యం వైరాలజీ సీట్ల కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు.

