NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 30 నుండి ప్లాస్టిక్ నిషేధం

1 min read

సిమెంట్ రోడ్లు నాణ్యతగా ఉండాలి

మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఈనెల 30వ తేదీ నుండి నందికొట్కూరు పట్టణంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి మంగళవారం అన్నారు. పట్టణంలో ఉన్న షాపుల యజమానులు మరియుమర్చంట్స్ అసోసియేషన్, మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కమిషనర్ మున్సిపాలిటీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై షాప్ ల యజమానులు సహకరించాలని ప్లాస్టిక్ వాడటం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందని “పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు. ముందుగా ఉదయం’అన్న క్యాంటీన్’ను కమిషనర్ తనిఖీ చేసి టిఫిన్ భోజనం నాణ్యతగా ఉండాలని మెనూ ప్రకారం భోజనం తయారు చేయాలని అన్నారు.తర్వాత జోరు కళాశాల కాలనీలో జరుగుతున్న సిమెంట్ రోడ్ పనులను కమిషనర్ పరిశీలించి పనులు నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్లను కమిషనర్ ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *