పెదవేగి సెక్షన్ పరిధిలో 25వ తేదీ విద్యుత్ కు అంతరాయం
1 min read
ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల
రైతులు,గృహ వినియోగదారులు సహకరించాలని మనవి
కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదవేగి మండలం పెదవేగి సెక్షన్ పరిధిలో గల 132 కె.వి పెదవేగి నుండి రామసింగవరం వెళ్ళు 33 కెవి లైన్ మరమత్తుల నిమిత్తం ఈనెల 25 వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, రైతు సోదరులకు రెండు విడతలు గా అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి 7 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ బోరుబావులకి విద్యుత్ సరఫరా చేయబడునని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎం. అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైతు సోదరులు గమనించి సహకరించవలసిందిగా ఆయన కోరారు.గృహ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగదని ఆయన తెలియజేశారు.

