NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రధానమంత్రి ప్రవాస యోజన కార్యక్రమం

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: పత్తికొండలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పత్తికొండ బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బిజెపి జిల్లా నాయకురాలు మాలతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.భారత ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలి,” అని ఆమె అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కరణం నరేష్  మాట్లాడుతూ, “ప్రతి గ్రామంలో బీజేపీ తత్వాన్ని, కేంద్ర పథకాలను ప్రజలకు చేర్చడం లక్ష్యంగా ప్రవాస యోజనను అమలు చేస్తున్నాం” అన్నారు. ఆయన కార్యకర్తలను ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ పథకాలు – ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన ధన్, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలను వివరించాలని సూచించారు.ఈ సమావేశం ముగింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజల్లోకి చేర్చడానికి బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ గోవర్ధన్ నాయుడు బిజెపి స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ పూన మల్లికార్జున కౌన్సిలింగ్ నెంబర్ దండి మల్లికార్జున బిజెపి జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు కిషన్ మోర్చా  అసెంబ్లీ ఇన్చార్జి సిసి రంగన్న  బిజెపి జిల్లా కార్యదర్శి శంకరయ్య చారి  మండల ప్రధాన  కార్యదర్శ వీరేష్ దేవకుంట రామాంజి నరసింహులు చంద్ర గోరంట్ల యువ మహిళా మోర్చా సభ్యులు రామాంజినమ్మ పందికోన గోపాల్  మరియు పత్తికొండ బీజేపీ కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author