తెప్పొత్సవంలో ఊరేగిన ప్రహ్లాదరాయులు
1 min read

మంత్రాలయం, న్యూస్ నేడు: రాఘవేంద్రస్వామి 354 వ సప్త రాత్రోత్సవాలలో భాగంగా రెండువ రోజు శనివారం నూతనంగా నిర్మించిన పుష్కరిణి ( కోనేరు) లో తెప్పొత్సవంలో ప్రహ్లదరాయులను ఆశీనులను చేసి పుష్కరిణిలో ఉరేగించారు. అనంతరం పుష్కరిణి లో ఏర్పాటు చేసిన శిలా మండపంలో ప్రహ్లాదరాయులను ఉంచి పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు , గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు, ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి, ఇంజనీర్ సురేష్ కోనాపూర్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, కుర్డీ జయతీర్థాచార్ తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

