శ్రీ మూల రామునికి సంస్థాన పూజలు…
1 min read

రాఘవేంద్రునికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పణ
మంత్రాలయం, న్యూస్ నేడు : కలియుగ కామధేనువు రాఘవేంద్రుని 354 వ సప్త ఆరాధనోత్సవాలు రెండో రోజు సాగుతున్నాయి. శనివారం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సంస్థాన పూజలు పురస్కరించుకుని శ్రీ మూల రామ దేవతలకు విశేష పంచామృతాభి షేకం, నిర్మల్య అభిషేకం, వేద వ్యాసుల పూజలు చేశారు. అంతకు ముందు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి నిత్య, విశేష అభిషేక పూజలు నిర్వహించారు. బృందావనానికి పట్టు వస్త్రాలు, స్వర్ణ కవచాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక హారతి ఇచ్చారు.
టిటిడి పట్టువస్త్రాలు సమర్పణ : రాఘవేంద్రుని సప్తరాత్రోత్సవాలు పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టీటీడీ ఏఈఓ రామకృష్ణ సతీసమేతంగా పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చారు. వీరికి ప్రధాన గేటు ముందు మఠం అధికారులు మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారికి చీర వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో టీటీడీ ఆలయ అధికారులను పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఘనంగా ఆహ్వానించి టీటీడీ పట్టు వస్త్రాలను స్వీకరించి శిరస్సు పై ఉంచి మఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం టీటీడీ ఏఈఓ రామకృష్ణ దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి శేషవస్ర్తం ఫల పుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. టిటిడి అధికారులు మఠం పీఠాధిపతులు సుబుదేంద్రతీర్థులను శేషవస్త్రం తీర్థప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు.భక్తులు ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని,శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. రాత్రి ప్రహ్లాద రాయులను, పల్లకి సేవ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి, మహోపాధ్యాయ రాజా ఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాధవచార్, కుర్డీ జయతీర్థాచార్, పూజారి వ్యాసరాజ్ స్వామి ,తదితరులు ఉన్నారు.నేడు పూర్వారాధన: సప్త రాథోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఆదివారం పూర్వారాధన పురస్కరించుకొని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష అభిషేక పూజల నిర్వహిస్తారు .


